NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్వ‌ర‌లో బంగారం ఏటీఎంలు.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ‌ంగారం ఏటీఎంలు త్వ‌ర‌లో రాబోతున్నాయి. బంగారాన్ని మరింత పెట్టుబడి సాధనంగా తీర్చిదిద్దడం, షోరూమ్‌ల్లో కొనుగోలు చేయడం వల్ల పడే అదనపు భారాన్ని తగ్గించడం, చిన్నచిన్న మొత్తాల్లో సాధారణ కొనుగోలుదారులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి వెలుసుబాటు కల్పించడం వంటి లక్ష్యాలతో బంగారం ఏటీఎంలు తీసుకొస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా గోల్డ్‌సిక్కా దేశవ్యాప్తంగా బంగారు ఏటీఎంలను ఏర్పాటు చేస్తోంది. హాల్‌మార్కింగ్‌, ఇతర గుర్తింపు ద్రువీకరణలు ఉన్న 0.5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకూ కాయిన్లను, ఆ పైన 100 గ్రాముల వరకూ బార్లను ఏటీఎంలలో ఉంచుతారు. ఒక్కో ఏటీఎంలో 5 కేజీల వరకూ పసిడి ఉంటుంది. గోల్డ్‌సిక్కా విక్రయించే కార్డులను కొనుగోలు చేసి ఏటీఎంల నుంచి కావాల్సినంత బంగారాన్ని పొందవచ్చు. డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డుల ద్వారా కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి వీలుగా బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి గోల్డ్‌సిక్కా సన్నాహాలు చేస్తోంది. షోరూమ్‌లతో పోలిస్తే ఉత్తమ ధరకు ఏటీఎంల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని తరుజ్‌ తెలిపారు. లైవ్‌ రేట్లకు అనుగుణంగా ఏటీఎంలో పసిడి ధరలు మారుతూ ఉంటాయి.

                                    

About Author