NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బంగారు చాన్స్‌ కొట్టేసిన మోనాల్‌..

1 min read

సినిమా డెస్క్​ : చాన్నాళ్ల క్రితం అల్లరి నరేష్ తో ‘సుడిగాడు’ చిత్రంలో నటించిన మోనాల్ గజ్జర్ ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో సౌత్ సినిమాలకు దూరం అయ్యింది. తెలుగులో ఈమె మళ్లీ రీ ఎంట్రీ దాదాపు అసాధ్యం అనుకున్న సమయంలో అనూహ్యంగా బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 4 లో మోనాల్ స్పెషల్ కంటెస్టెంట్‌గా జాయిన్ అయ్యింది ఆమె హౌస్ లో ఉన్నన్ని రోజులు విమర్శలు వచ్చాయి. అయినా కూడా తన పద్దతిలో తాను ఆడి చివరి వారం వరకు వచ్చింది. బిబీతో రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల తెలుగు లో ఈమెకు వరుసగా ఆఫర్లు దక్కుతున్నాయి. ముఖ్యంగా తెలుగులో ఆమె సినిమాల్లో నటించడమే కాకుండా వెబ్ సిరీస్‌ల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంటుంది. తాజాగా మోనాల్‌ హీరోయిన్ గా అఖిల్ హీరోగా ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో ఐటెం సాంగ్‌ను కూడా చేస్తోంది. ఇటీవలే ఒక సూపర్ హిట్ ఐటెం సాంగ్‌లో ఆడి పాడింది. మళ్లీ బంగారంలాంటి ఛాన్స్ ఈ అమ్మడికి దక్కింది. యువ సామ్రాట్​ అక్కినేని నాగార్జున నటించిన ‘బంగార్రాజు’లో ఓసాంగ్​లో కనిపించనుంది.

About Author