అరకిలో బంగారు ఆభరణాలు..57 వజ్రాలు స్వాధీనం
1 min readపల్లెవెలుగు వెబ్: అంతర్రాష్ట సరిహద్దు.. పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ సీఐ మంజుల ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అరకిలో పైగా బంగారు ఆభరణాలు, 57 వజ్రాలు గుర్తించారు. సోమవారం తెల్లవారు జాము హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న NL 01 B 2048 నిదా ప్రైవేటు ట్రావెల్ బస్సులో తనిఖీ చేయగా అందులో రాజస్థాన్ రాష్ట్రం, జున్జున్ పట్టణం కు చెందిన కపిల్ అనే వ్యక్తి బ్యాగులో సుమారు 840 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 57 వజ్రాలు గుర్తించారు. వీటి విలువ ₹ 39,28,000/(సుమారు ముప్పై తొమ్మిది లక్షల,ఇరభై యెనిమిది వేల రూపాయలు) వుంటుందని .తాను హైదరాబాదు నుండి తన అన్న ఈ నగలు బెంగళూరు లో కొన్ని నగల దుకాణం లకు ఇచ్చి రమ్మనాడని ,,ఈ నగల గురించి తనకేమీ తెలియదని,కేవలం ఈ నగల ప్యాకింగ్ పెట్టె బెంగలూరు లో మరో వ్యక్తి కు ఇచ్చి రమ్మనాడనీ తెలిపాడు.ఈ ఆభరణాలకు సంబందించి ఈ – వే బిల్లు మరియు ట్రావెలింగ్ ఓచర్, జి యస్ టి బిల్లులు లేవని చెప్పగా సదరు వ్యక్తిని ,పట్టుబడిన బంగారు ఆభరణాలు,వజ్రాలను ను తగిన ఆధారాల ధృవీకరణ పత్రాల పరిశీలన కొరకు కర్నూల్ తాలూకా పోలీసు స్టేషన్ కు తదుపరి విచారణ నిమిత్తం పంపడమైనది. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ,ఖాజా, మహమ్మద్,,కానిస్టేబుళ్లు మురళి,SPO ,, సుంకన్న, సుందర్,విజయ భాస్కర్ లు పాల్గొన్నారు.