PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పుష్ప‌లోని `ఊ.. అంటావా` పాట‌కు గోల్డ్ మెడ‌ల్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూప్ ‘బిహైండ్ వుడ్’ ఈ ఏడాదితో 19 ఏళ్ళను పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా యానివర్సరీ సెలబ్రేషన్ నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా.. మే 22న ఈ ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమాలు, నటులు, సింగర్స్ కు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనుంది. అందులో భాగంగానే బెస్ట్ సింగర్ విభాగంలో ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మావా.. ఉఊ.. అంటావా మావా’ పాటను ఆలపించి.. దాన్ని జనంలోకి బాగా తీసుకెళ్ళిన ఇంద్రావతి చౌహాన్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకొన్న ఇంద్రావతి మే 22న ‘ఊ అంటావా మావా.. ఉఊ.. అంటావా మావా’ పాటకు గోల్డ్ మెడల్ అందుకోబోతున్నానని, తనకు ఈ గుర్తింపు రావడానికి కారణం సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ అని, ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఇది నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపింది.

                                

About Author