విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు…‘జెనిత్’ భరోసా
1 min readఉత్తమ కోచింగ్‌తో..నవోదయ, సైనిక్ స్కూల్, రాష్ర్టీయ మిలిటరీ, గురుకులకు ఎంపిక
పల్లెవెలుగు వెబ్, కర్నూలు:పిల్లల బంగారు భవిష్యత్‌కు భరోసా ఇస్తూ… అత్యుత్తమ క్రమశిక్షణ గల విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తోంది జెనిత్ కోచింగ్ సెంటర్. విశాలమైన భవనంలో ఆధునిక టెక్నాలజీ…అనుభవం గల లెక్చరర్లతో నవోదయ, సైనిక్ స్కూల్, రాష్ట్రీయ మిలిటరీ, గురుకుల పాఠశాలకు ఎంపిక అయ్యేలా కోచింగ్ ఇస్తున్నారు. కార్పొరేట్..ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా కోచింగ్ సెంటర్లో మెళకువలు నేర్పుతూ… విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. రాయలసీమ యూనివర్శిటీకి అతి సమీపంలో ఉన్న జెనిత్ కోచింగ్ సెంటర్ ను చైర్మన్ ఎన్వి ఖాన్, డైరెక్టర్ బి. సతీష్ నేతృత్వంలో కొనసాగుతోంది. బాలబాలికలకు ప్రత్యేక హాస్టల్, భోజన వసతి ఉంది.
సులభ పద్ధతిలో.. బోధన..:
నవోదయ, సైనిక్, గురుకుల, రాష్ట్రీయ మిలిటరీ స్కూళ్లలో సీటు పొందేందుకు పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సులభమైన పద్ధతి ద్వారా విద్యార్థులకు అర్థమయ్యేలా శిక్షణ ఇస్తూ… ప్రశ్నలకు శరవేగంగా సమాధానం చెప్పేలా.. రాసేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రతిభావంతులైన టీచర్ల ద్వారా ఇంగ్లీష్ మీడియంలో కంప్యూటర్లు,ల్యాప్టాబ్స, డిజిటల్ క్లాసుల సహాయంతో పాఠాలు బోధిస్తున్నారు. నవోదయ, సైనిక్ స్కూల్, ఏపీ టీఎస్ గురుకుల పాఠశాలలకు, ఎన్డీఏ, సీడీఎస్ మరియు పారామిలిటరీలో ప్రవేశ పరీక్ష కొరకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణలో భాగంగా ధ్యానం, యోగా, దేహదారుఢ్య శిక్షణ ఇస్తున్నారు.
నవోదయకు… అర్హత..
5వ తరగతి మరియు 8వ తరగతి చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులు నవోదయ ఎంట్రెన్స్ పరీక్షకు అర్హులు. ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. జనవరి ఆఖరి వరకు అడ్మిషన్లు కొనసాగిస్తారు. 120 మందికి అడ్మిషన్ పొందే అవకాశం ఉంది.
భోజనం… వసతి:
జెనిత్ కోచింగ్ సెంటర్లో చేరే విద్యార్థినీవిద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ వసతి ఉంది. మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తారు. వారంలో రెండు సార్లు గుడ్డు, ఒకసారి చికెన్ వంట చేస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ సతీష్ పేర్కొన్నారు.