బంగారు వీణ గ్రహీత హార్మోనిస్ట్ రామలింగంకి ఘన సన్మానం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరం లోని చెన్నమ్మ సర్కిల్లో గల రైతు కళానిలయం నందు ఈరోజు ఉదయం కర్నూలు కళాకారుల సేవ కేంద్రం హనుమాన్ కళా సమితి సంయుక్తంగా సంగీత గురువులు బంగారు వీణ అవార్డు గ్రహీత వెండి హనుమ అవార్డు గ్రహీత యు రామలింగంని శాలువ కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది. హైదరాబాద్ వారి శ్రీ కళానికేతన్ వారిచే ప్రదర్శింపబడిన పద్యనాటికమ్ వసంత రాజ్యం ప్రథమ బంగారు వీణ అవార్డు మరియు తిరుపతి హనుమ అవార్డ్స్ ప్రదర్శనలో ద్వితీయ రజిత హనుమ అవార్డు యు రామలింగం సంగీత దర్శకత్వంలో రాష్ట్రస్థాయి బహుమతులు వచ్చాయి కర్నూలు జిల్లా రంగస్థలం సంగీత గురువులు యు రామలింగంని అభినందిస్తూ ప్రశంసిస్తూ సన్మానం కర్నూలు కళాకారుల సేవా కేంద్రం అధ్యక్షులు బైలుప్పల షఫీయుల్లా హనుమాన్ కళా సమితి అధ్యక్షులు పెరికలపాటి హనుమంతరావు చౌదరి ఘనంగా సత్కరించారు. కర్నూలు నగరానికి చెందిన సంగీత గురువులు యు రామలింగం బంగారు వీణ వెండి హనుమ సాధించినందుకు కర్నూలు రంగస్థలం ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటుందని విశ్రాంతి తహసిల్దార్ సిబి అజయ్ కుమార్ ప్రశంసించారు. వసంత రాజ్యం నాటకంలో ప్రత్యేక పాత్రధారి లక్ష్మణ రాజును కళాకారులు ప్రశంసించారు. రైతు కళానిలయంలో గురువులు సంగీత విద్వాంసులు యు రామలింగంకి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో బహుమతులు జాతీయస్థాయిలో అందుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ కర్నూలు రంగస్థలం కళాకారులు పెరికలపాటి హనుమంతరావు చౌదరి బైలుప్పల షఫీయుల్లా సిబి అజయ్ కుమార్ పద్మనాభం అంబాటి నారాయణరెడ్డి బాలకృష్ణ లక్ష్మణ రాజు వెంకటరమణ కర్నూలు కళాకారులు పాల్గొని యు రామలింగంని అభినందించడం జరిగింది. అభినందనలు తెలియజేసిన కళా సంఘాలకు కళాకారులకు యు రామలింగం కృతజ్ఞతలు తెలియజేశారు.