గోవింద నామస్మరణతో మార్మోగిన గుళ్ళదుర్తి
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గుళ్ళదుర్తి గ్రామం లోని శ్రీ జంబుకేశ్వరాలయం నందు గత నాలుగు రోజుల నుండి జరుగుతున్న ధార్మిక ప్రవచనాలు, భజనలు, గోపూజ, కుంకుమార్చనలు, నగర సంకీర్తనలతో గోవిందనామ స్మరణతో మార్మోగిపోయింది. మూడు రోజులపాటు సాగిన యం మద్దయ్య స్వామి రామాయణ, మహాభారత, భగవద్గీత ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శుక్రవారం గోమాతను ఊరేగింపు గోపూజ, కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మంలో ప్రతి ఆచారం వెనుక ఎంతో శాస్త్రీయత ఉన్నదన్నారు. మహర్షులు మనకందించిన ఋషి ధర్మాన్ని అనుసరించడమే దేశానికి, ప్రపంచానికి హితకరమని చాటారు.
ప్రపంచ సాహిత్యంలో యే సాహిత్యానికీ లేనంత గొప్పతనం మన ఇతిహాసాలకున్నదన్నారు. పాశ్చాత్య అనుకరణ ఈ దేశానికి గాని మనకు గాని ఏవిధంగా కూడా శ్రేయస్కరం కాదని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో గుళ్ళదుర్తి గ్రామ సర్పంచ్ కొర్రా శ్రీలతావేంకటేశ్వర్లు, భజన మండలి అధ్యక్షులు ఈడిగ వేంకటరమణ, బత్తుల రామసుబ్బయ్య, అనకల గురివిరెడ్డి, తిప్పుగారి తులసమ్మ, అనకల వేంకట లక్షుమ్మ, పాలూరు తులసిరెడ్డి, చెప్పల్లి నరసింహా రెడ్డి, బత్తుల చిన్న వెంకటసుబ్బయ్య,ఆరికట్ల శ్రీనివాసులు రెడ్డి, కాతా శంకర రెడ్డి,చెప్పల్లి మహేశ్వర రెడ్డి,తుమ్మల చిన్నశివుడు, సమరసతా సేవా ఫౌండేషన్ ప్రచారక్ గుళ్ళళ్ళ వేంకట సుబ్బయ్య, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆలయం కమిటీ గ్రామంలోని ప్రజలందరికీ అన్నదానం చేశారు.