‘ గోనెగండ్ల’.. హత్య కేసులో ముద్దాయిలు అరెస్టు
1 min read– రెండు బైకులు, మూడు వేటకొడవళ్లు, ఒకటి పిడి బాకు స్వాధీనం
– వెల్లడించిన ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్
పల్లెవెలుగు వెబ్, గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల లక్ష్మిపేటలో ఈ నెల 18న అర్ధరాత్రి 11.50 గంటల సమయంలో జరిగిన బోయ తలారి బజారి హత్య కేసు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 18న లక్ష్మిపేటలో కాపురం ఉంటున్న తలారిబజారి, ఉరుకుందమ్మ, ఆమె కూతురు అంజలి ఇంటిలో నిద్రిస్తుండగా నలుగురు వ్యక్తులు వేటకొడవళ్లు, పిడి బాకులతో దాడి చేశారు. అడ్డుకోబోయిన ఉరుకుందమ్మ పై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో తలారి బజారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉరుకుందమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన గోనెగండ్ల పోలీసులు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మిగనూరు రూరల్ సీఐ బీఏ మంజునాథ్, గోనెగండ్ల ఎస్ఐ సి. శరత్ కుమార్ రెడ్డి, ఎమ్మిగనూర్ రూరల్ ఎస్ఐ యూ. సునిల్ కుమార్ మరియు సిబ్బంది ఎమ్మిగనూరు మండలం గుడెకల్లు నుంచి ఎమ్మిగనూరు టౌన్ మైనార్టీ కాలనీకి వెళ్తున్న ముద్దాయిలను అరెస్టు చేశారు. A1)బోయ రంగయ్య కుమారుడు బోయ నాగరాజు వయస్సు 40 సం!!లు,A2) బోయ కుర్మి గుంటేప్ప కుమారుడు బోయ కుర్మి మునిస్వామి వయస్సు 21 సం..లు A3) బోయ చిన్న ఈరన్న కుమారుడు బోయ వెంకటేష్ వయస్సు 26 సం!!లు A4) బోయ నల్లన్న కుమారుడు బోయ నరసింహులు @ నల్లన్న వయస్సు 36 సం!!లు. వీరందరిది ఎమ్మిగనూర్ మండలం గుడెకల్ గ్రామము. ముద్దాయిల నుంచి రెండు మోటారు సైకిళ్లు, 3 వేట కొడవళ్లు, ఒకటి పిడి బాకు స్వాధీనం చేసుకున్నట్లు ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ఏ మంజునాథ్ తెలిపారు. కాగా ఉరుకుందమ్మ అక్రమ సంబంధమే బోయ తలారి బజారి హత్యకు దారి తీసిందని గ్రామస్తులు పేర్కొనడం గమనార్హం.