బుట్టా శివ నీలకంఠ కి కృతజ్ఞతలు తెలిపిన గొనెగండ్ల మండల నాయకులు
1 min read
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు : గోనెగండ్ల మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా చికెన్ రాజా, మండల కార్యదర్శిగా కడపల ఉరుకుందు, మండల ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా అల్లగొండ సత్తార్ లను పార్టీ నూతనంగా నియమించింది. ఈ నియామకాలు మన పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే విధంగా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం.ఈ బాధ్యతలు మాకు అప్పగిస్తూ నమ్మకాన్ని చూపిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక కి, పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు చూపిన మార్గదర్శకత్వం పట్ల మేము ఎప్పటికీ కృతజ్ఞులమే.ఈ నియామకాలకు సహకరించిన జిల్లా పార్టీ కార్యదర్శి టీ. బందే నవాజ్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి సహకారం మా నాయకత్వాన్ని ముందుకు నడిపించేలా మారింది.మాపై విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించిన బుట్టా శివ నీలకంఠని పార్టీ కార్యాలయంలో శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఇది మా గౌరవానికి నిదర్శనంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ కే మాబు వలి, మాజీ ఉప సర్పంచ్ గోవిందు, నదిముల్లా బగిలి ఉస్మాన్ సాబ్, తదితర వైయస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.