ఈ ఉద్యోగాలకు మంచి డిమాండ్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : డిజిటల్ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల కొరత తీవ్రంగా ఏర్పడింది. జావా, క్లౌడ్ అండ్ ఫ్లాట్ ఫామ్, డేటా అనలిటిక్స్ సంబంధించిన ఉద్యోగుల కోసం కంపెనీలు జల్లెడపడుతున్నాయి. ఉన్న ఉద్యోగులను కొన్ని కంపెనీలు రెట్టింపు జీతం ఇచ్చి ఎగరేసుకుపోతుంటే.. కొత్త ప్రాజెక్టులు తీసుకోవడానికి కంపెనీలు వెనుకాడుతున్నాయి. దీంతో క్యాంపస్ ప్లేస్ మెంట్ పై కంపెనీలు దృష్టి పెట్టాయి. గతంలో ప్రధాన నగరాల్లోని కాలేజీలపైనే అధికంగా ఫోకస్ చేసిన కంపెనీలు.. ఇప్పుడు చిన్నచిన్న కాలేజీలపై కూడ ఫోకస్ చేస్తున్నాయి. స్కిల్స్ లేకపోయినా నేర్చుకోవాలని తపన ఉంటే శిక్షణ అందించి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. నగరాల వారీగా చూస్తే బెంగళూరు, హైదరాబాద్ ఐటీ కంపెనీలు డిజిటల్ నైపుణ్యాల్లో సత్తా ఉన్న ఉద్యోగుల కోసం జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ ఉద్యోగులకు ఉన్న మొత్తం డిమాండ్‌లో 40 శాతం బెంగళూరు, 20 శాతం హైదరాబాద్ కంపెనీల నుంచి ఉంది. పుణె, చెన్నై, ఢిల్లీల్లోని ఐటీ కంపెనీల్లోనూ డిజిటల్ నైపుణ్యాల్లో పట్టు ఉన్న ఐటీ ఉద్యోగులకు మంచి డిమాండ్ ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.