భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే.. బహిరంగ శిలువ యాత్ర
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: దుర్వేసి గ్రామంలో ఉన్న ఆర్జీఎం చర్చి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే సందర్భంగా బహిరంగ సిలువ యాత్ర కోరట మద్ది నుండి దుర్వేసి గ్రామం వరకు కొనసాగింది రెవరెండ్ సురేష్ .రెవరెండ్ నికోలస్ ఆధ్వర్యంలో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవ సోదరులు సోదరీమణులు చర్చిలకు వెళ్ళి యేసు ప్రభువును ప్రార్థిస్తారు. క్రీస్తు జననం(క్రిస్మస్) పండుగ తర్వాత క్రీస్తు పేరిట ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. ఈ సమయాన్నే “ఈస్ట్ వెడ్నెస్‌డే” నుంచి ప్రారంభమౌతుంది. ఇది గుడ్ ఫ్రైడే రోజుకు పరిసమాప్తమౌతుంది. దీనినే లెంట్ అని అంటారని ఇదే రోజున క్రీస్తును శిలువ చేశారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు కొయ్యతో చేసిన శిలువను చర్చిలలో ఉంచి ప్రార్థిస్తారు. ప్రతి ఒక క్రిస్టియన్ వచ్చి ఆ శిలువను ముద్దాడుతారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.