గ్రామ సచివాలయాలతోనే సుపరిపాలన : ఎం ఎల్ ఏ మేడా
1 min readపల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: గ్రామీణ ప్రాంతాల లోని ప్రజలకు సుపరిపాలన అందించడానికే గ్రామ సచివాలయాలు ఎర్పాటు చేయడం జరిగిందని స్థానిక ఎం ఎల్ ఏ మేడా మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు.శుక్ర వారం వీరబల్లి మండల పరిధిలోని గురప్పగారిపల్లి గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ప్రజల సమస్యలపై ప్రతీ ఇల్లు తిరిగి ఆరా తీశాడు .పలు ప్రాంతాలలో సి సి రోడ్లు,త్రాగు నీరు ,విధ్యుత్ తధితర అంశాలపై వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి, గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, జడ్ పి టి సి శివరామ, ఎం పి పి రాజేంధ్ర నాధ్ రెడ్డి, వై సి పి మండల కన్వీనర్ మహేష్ రాజు,వై సి పి నాయకులు వీరనాగిరెడ్డి,సుబ్బారామ రాజు,వి ఆర్ రెడ్ది,శ్రీరాములు రెడ్డి, మధుసూధనరెడ్డి ,మణిరాజు, బి సి సంఘం అధ్యక్షుడు ఈశ్వరయ్య ,బి సి నాయకులు బొగ్గుల రెడ్డేయ్య, కార్యకర్తలు, తధితరులు పాల్గొన్నారు.