క్రీడలతో మంచి ఆరోగ్యం ..ఎమ్మెల్యే
1 min read
ఆదోని, న్యూస్ నేడు: ఆటలు ఎంత బాగా ఆడితే అంత మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకున్న వారమవుతామని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. శనివారం సౌత్ ఇండియా టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదోనిలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి శనివారం, ఆదివారం రోజు ప్లే గ్రౌండ్ నిండా చేరి మంచి మంచి ఆటలు ఆడుకోవాలని ఆటలు ఆడడం ద్వారా మాత్రమే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలమని అన్నారు.ఆటలు ఆడడానికి ఆదోనికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసి ఆదోనికి మరికొన్ని ఊర్ల నుండి కూడా ఆటలు ఆడుకోవడానికి రావాలని వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆదోని ఈరోజు సిద్ధంగా ఉందని అన్ని ఏర్పాట్లు కూడా చేయిస్తామని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు.