NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సహజ పానీయాలతో నే చక్కటి ఆరోగ్యం

1 min read
శీతల పానీయం.. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఐ సత్యనారాయణ

శీతల పానీయం.. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఐ సత్యనారాయణ

– సీఐ సత్యనారాయణ
పల్లెవెలుగు వెబ్​, కడప: వేసవి కాలంలో సహజ పానీయాలతోనే చక్కని ఆరోగ్యం అని, ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ Ci సత్యనారాయణ అన్నారు. శాంతి సేవా సొసైటీ ఆధ్వర్యంలో శీతలపానీయలు వద్దు..సహజ పానీయలే ముద్దు.. అనే కార్యక్రమాన్ని కడప రైతు బజార్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీఐ ప్రారంభించి మాట్లాడారు. కూల్ డ్రింక్ తాగడం అందరికీ ఫ్యాషన్​గా మారిందని, కానీ దానివల్ల అనేక రోగాలను కొనితెచ్చుకుంటున్నామని తెలుసుకోలేపోతున్నారన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున టోపీలు, గొడుగులు ఉపయోగించాలని, శానిటైజర్​, మాస్క్​లు, భౌతిక దూరం తప్పక పాటించాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, శాంతి సేవా సొసైటీ సభ్యులను అభినందించారు. భవిష్యత్ రోజుల్లో ఈ సంఘం దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో శాంతి సేవా సొసైటీ వ్యవస్థాపకులు, ప్రసాద్. రైతు బజార్ మేనేజర్ మహేంద్ర, కార్యదర్శి మోహన్. సహాయ కార్యదర్శి, విజయ్ కుమార్ .సభ్యులు సందీప్, మనోహర్, చరణ్, సుభాషిని రావు. తదితరులు పాల్గొన్నారు.

About Author