NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కళాకారులకు సేవ చేయడం అదృష్టం

1 min read

టీడీపీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు పెనికలపాటి హనుమంతరావు చౌదరి

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు:  దైనందిన జీవితంలో ఒత్తిడితో సతమతమయ్యే ప్రజల్లో తమ కళలు, కళా ప్రదర్శనల ద్వారా ఆహ్లాదాన్ని పంచి ఆనందింపచేసే కళాకారులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు పెనికలపాటి హనుమంతరావు చౌదరి అన్నారు. సమాజ ఆనందమే తమ ఆనందంగా భావించే కళాకారులకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక గుర్తింపు, స్థానం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా కొనసాగేందుకు మరోసారి అవకాశం కల్పించినందుకు పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు మంగళవారం పార్టీ కార్యాలయంలో శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ కళాకారులకు సేవ చేసే అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తనకు అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కృతజ్ఘతలు తెలియజేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు నావంతు చిత్తశుద్ధితో కృషి చేస్తానని హనుమంతరావు చౌదరి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్ర, తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కర్నూలు నగర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నాగేశ్వరరావు చౌదరి, మహేష్ గౌడు తదితరులు పాల్గొన్నారు.

About Author