ఏపీకి గుడ్ న్యూస్
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలో రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలో కూడా నేడు, రేపు రాష్ట్రంలో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.