ఏపీ రైతులకు శుభవార్త !
1 min readపల్లెవెలుగువెబ్ : కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలను ఇవ్వాలని సంకల్పించింది. 50% సబ్సిడీపై రూ.403 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలను అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని గ్రామానికి 25 మంది చొప్పున 2.68 లక్షల మందికి రూ.15 వేల విలువైన యూనిట్లను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే గ్రామానికి 7–8 మంది చొప్పున 80,600 మందికి రూ.50 వేల విలువైనవి 2 యూనిట్ల చొప్పున 50 శాతం సబ్సిడీపై మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ యూనిట్లను అందించడానికి రూ.403 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.