ఏపీ మున్సిపాలిటీ కార్మికులకు శుభవార్త
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపాలిటీలో పని చేసే పారిశుధ్య కార్మికులకు ఓహెచ్ఏ(ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్సు)కు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రూ. 6 వేలు చెల్లింపులపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. మున్సిపల్ కార్మికుల 15 వేల వేతనానికి అదనంగా 6 వేలు ఓ హెచ్ ఏను చెల్లించనునుంది ఏపీ ప్రభుత్వం. దీంతో పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ. 21 వేలకు పెరిగినట్లు అయ్యింది. తాజా ఉత్తర్వులతో 43 వేలమందికి పైగా కార్మికులకు మేలు జరగనుంది.