PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో సేవలు అందించడానికి 1,681 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వైద్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే 8,351 పోస్టుల భర్తీ పూర్తయింది. మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. hmfw.ap.gov.in లేదా cfw.ap.nic.in ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు హాల్‌ టికెట్లు జారీ చేస్తారు. సెపె్టంబర్‌ మొదటి వారంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీ హాల్‌టికెట్‌లలో తెలియజేస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

                                     

About Author