ఉద్యోగులకు గుడ్ న్యూస్
1 min read
పల్లెవెలుగువెబ్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అతిత్వరలోనే గుడ్‌న్యూస్ అందబోతోంది. 7వ వేతన సంఘం సిఫార్సు ప్రకారం 4 శాతం డీఏ పెంపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని, రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు శుభంకార్డు పడే సూచనలున్నాయి. అయితే డీఏ పెంపు ప్రకటన తేదీపై కేంద్రప్రభుత్వం ఇంతవరకు అధికారిక ప్రకటనేమీ చేయలేదు. సెప్టెంబర్ 28న (బుధవారం) ప్రధాని నరేంద్ర మోడీ డీఏ, డీఆర్ పెంపుపై ప్రకటన చేయవచ్చునని రిపోర్టులు పేర్కొంటున్నాయి.