రైతులకు శుభవార్త !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రభుత్వం రైతుల కోసం పలు కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పేరుతో అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా నాటు వేసినప్పటి నుంచి పంట విక్రయించేవరకు అన్ని పనులను చక్కబెడుతోంది. అలాగే కమ్యూనిటీ హైరింగ్ పద్ధతిలో ట్రాక్టర్లు, యంత్రపరికరాలను అందిస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన ప్రభుత్వం.. రైతులకు సబ్సిడీపై యంత్రపరికరాలను అందేంచేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా రైతులకు కూలీల కొరత తగ్గించేందుకు, వారి పనులు వేగంగా పూర్తయ్యేందుకు ఈ పథకం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. అద్దె ప్రాతిపదికన వ్యవహాయ యంత్ర పరికరాలను అందిస్తోంది.