రైతులకు శుభవార్త.. మీ పంట ఇక పాడవ్వదు !
1 min readపల్లెవెలుగువెబ్ : రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయలకు కోత అనంతరం నష్టాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్బీకేల పరిధిలో ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి తెలిపారు. ఉద్యాన పంటలు పండించే ప్రాంతాల్లో ప్రతి నాలుగు ఆర్బీకేలకు ఒక ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం, కోల్డ్ స్టోరేజీని నిర్మిస్తామని చెప్పారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో నిర్మించిన ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం, రైతు శిక్షణ కేంద్రాన్ని సోమవారం మంత్రి కాకాణి ప్రారంభించారు.