ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డియర్‌నెస్ అలవెన్స్ , పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ విడుదల చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డియర్‌నెస్ అలవెన్స్ ను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో డియర్‌నెస్ అలవెన్స్ 34 శాతంకు చేరనుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 31 శాతం మేర డీఏను పెంచాలని కేంద్రం నిర్ణయించగా..ఇప్పుడు అనూహ్యంగా డీఏను 34 శాతంగా పెంచింది. 7వ వేతన సంఘం సిఫార్సులు ఆధారంగా డీఏ అమలు జనవరి 1, 2022 అమల్లోకి రానుంది. ధరల పెరుగుదల నేపథ్యంలో బేసిక్ పే/పెన్షన్‌కు అదనంగా 3 శాతం డీఏ పెంపును వేతన సంఘం సిఫార్సు చేసింది.