వాహనదారులకు గుడ్ న్యూస్..
1 min readఢిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటికే గడువు తీరిన.. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ) ల వ్యాలిడిటీని పెంచాలంటూ కేంద్ర రహదారి, రవాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే.. ఇది 1 ఫిబ్రవరి 2021 నుంచి మార్చి 31 మధ్య వ్యాలిడిటీ పూర్తయిన వారికి మాత్రమే వర్తిస్తుంది. వీరందరికి మరో మూడు నెలలు వ్యాలిడిటీ పెరుగుతుంది. అంటే జూన్ 30 వరకు వీరి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ల వ్యాలిడిటీ చెల్లుబాటవుతుంది. మోటార్ వెహికల్ చట్టం-1988 నిబంధనల ప్రకారం వ్యాలిడిటీ పూర్తయిన ఏడాది లోపు ఎప్పుడైనా రిన్యూవల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే.. కరోన నేపథ్యంలో చాలా మంది తమ డ్రైవింగ్ లైసెన్స్ , ఆర్సీలను రిన్యూవల్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి అవకాశం కల్పిస్తూ కేంద్ర రహదారి,రవాణ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.