పెన్షనర్లకు శుభవార్త !
1 min readపల్లెవెలుగువెబ్ : ఈపీఎఫ్వో పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను తేలికగా, ఎక్కడ నుంచైనా సమర్పించొచ్చు. ముఖ గుర్తింపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఓ సంస్థ అందుబాటులోకి తీసుచ్చింది. దేశవ్యాప్తంగా ఈపీఎఫ్వో పెన్షనర్లు 73 లక్షల మంది ఉన్నారు. ప్రతి ఏడాది వీరు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. వృద్ధాప్యం వల్ల ఐరిష్, వేలి ముద్రలతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి భౌతికంగా సంబంధిత కార్యాలయాలకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగిస్తూ ఎక్కడి నుంచైనా ముఖ గుర్తింపు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సౌకర్యాన్ని ఈపీఎ్‌ఫవో అందుబాటులోకి తీసుకొచ్చింది.