NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామీణ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టెక్‌ మహీంద్రా గ్రామీణ విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది. కంపెనీకి చెందిన మేకర్స్‌ ల్యాబ్‌ ‘మెటా విలేజ్‌’ను లాంచ్‌ చేసింది. ఈ ఫ్లాట్‌ ఫామ్‌తో లాంగ్వేజ్‌ ప్రాబ్లమ్‌ ఫేస్‌ చేసే వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఉపాధి పొందాలనుకునే విద్యార్ధులకు వరంగా మారనుంది. మేకర్స్ ల్యాబ్ డిజైన్‌ చేసిన ఈ ప్లాట్‌ఫారమ్ లోకల్‌ లాంగ్వేజ్‌లో కంప్యూటర్‌లు, కోడింగ్ నేర్చుకునేలా సాయపడనుంది. ఇందులో భాగంగా టెక్‌ మహీంద్రా మహరాష్ట్రలోని పరాగావ్ గ్రామంలో మెటా విలేజ్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ ఫామ్‌ మెటా విలేజ్ సాయంతో విద్యార్థులు స్థానిక మాతృ భాషలో కోడింగ్‌ చేసేలా కోచింగ్‌ ఇవ్వనుంది. ప్రస్తుతం పరాగావ్‌ గ్రామ విద్యార్ధులకు ఆన్‌లైన్‌లో కోడింగ్‌ నేర్పిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

                                          

About Author