NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నవరత్నపథకాల వల్లే…ఎన్నికల్లో సత్ఫలితాలు! సజ్జల

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: రాష్ట్రంలో సీఎం వై.ఎస్​.జగన్మోహన్​రెడ్డి అమలు చేస్తోన్న నవరత్నపథకాల వల్లే ఆయా ఎన్నికల్లో సత్ఫలితాలు వస్తున్నాయని వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడెపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షనేత చంద్రబాబు తన అనుచర మీడియాతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా… పరిషత్​ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 98శాతం స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించారని పేర్కొన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి 65శాతం ఓట్లు పోలయితే, జెడ్సీటీసీ ఎన్నికల్లో 70శాతం ఓట్లు వచ్చాయని వివరించారు. చంరదబాబును సొంత కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా నమ్మడం లేదని ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రతిపక్షనేత ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. వైసీపీ పాలనలో పదవుల విషయంలో అన్నివర్గాల వారికి సమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. వైసీపీలో నేతలందరూ పార్టీ నిర్ధేశించిన క్రమశిక్షణతోనే పనిచేస్తున్నారన్నారు.

About Author