PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గూడ్స్ బండి ఢీ.. పెద్దపులి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్​,మహానంది: నల్లమల అటవీ ప్రాంతంలోని  చలమ బొగద వద్ద ప్రమాదవశాత్తు పెద్దపులి మృతి చెందింది. రైల్వే అధికారుల సమాచారం మేరకు అటవీ శాఖ కన్సర్ వేటర్ రామకృష్ణ,నంద్యాల డివిజనల్ అధికారి వినీత్ కుమార్, ఎఫ్ ఆర్ ఓ ఈశ్వరయ్య సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. గురువారం రాత్రి పెద్దపులి రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ బండి ఢీ కొని మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతిచెందిన పెద్దపులికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేశాక నల్లమల అటవీ ప్రాంతంలో ఖననం చేశారు.

About Author