గూగూల్ పే, ఫోన్ పేకు పోటీగా.. `టాటా పే`
1 min readపల్లెవెలుగువెబ్ : టాటా సంస్థ టాటాపే సేవలు అందుబాటులోకి తెచ్చింది. టాటా పే యూపీఐ సేవలు టాటా న్యూ యాప్‌లో పొందుపరిచారు. టాటా న్యూ యాప్‌తో జరిపే లావాదేవీలను టాటా పే ఉపయోగించి చెల్లించవచ్చును. ఈ చెల్లింపులతో యూజర్లకు న్యూకాయిన్స్(Neucoins)ను లభించనున్నాయి. టాటా న్యూ అందించే రిడెంప్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా టాటా పే ఉపయోగించి లేదా ఏదైనా టాటా గ్రూప్స్‌కు చెందిన స్టోర్లలో జరిపే కొనుగోళ్ల ద్వారా మాత్రమే న్యూకాయిన్స్ లభిస్తాయి. ప్రతి ఒక్క న్యూకాయిన్స్ విలువ రూ. 1 సమానం. కొత్త టాటా పే యూపీఐ ఖాతాను సృష్టించడానికి… ప్రతి ఒకరు మూడు-దశల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అనుసరించాలి. స్కానింగ్, బ్యాలెన్స్ చెక్, ఖాతా/ స్వీయ-బదిలీ మొదలైన అన్ని సేవలను పొందవచ్చును.