కన్నుల పండుగగా గోపాష్టమి వేడుకలు
1 min readపల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: మండల కేంద్రమైన చెన్నూరు శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఉన్న గోశాలలో గోవులకు మంగళవారం గోపాష్టమి పండగ సందర్భంగా గోవులకు విశేషమైన గో పూజలు నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు గోశాలలో గోవులకు పూజలు నిర్వహించారు. శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. పండితులు పూజలు నిర్వహిస్తూ గోమాతలకు మహిళలు పసుపు కుంకంతో పూజించారు. మల్లేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా గోశాల ఆలయావరణంలో నిర్మించారు. అప్పటినుంచి గోశాలలో ప్రతి సంవత్సరం గోపాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. గోపాష్టమి విశిష్టతపై శ్రీకృష్ణుడిని ఆవులను పూజించే పండుగ గోపాష్టమి. దీపావళి తర్వాత కార్తీక మాసం శుక్లపక్షం అష్టమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు తండ్రి నందమహరాజు బృందావనంలో గోవులను సంరక్షించే బాధ్యతను కృష్ణుడికి అప్పగించినప్పుడు నిర్వహించే వేడుకే గోపాష్టమి. గోవులలో గోవులలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారని నమ్మకముతో ప్రజలు గోవులను పూజిస్తారు. చెన్నూరు గోశాలలో గోవులను పూజించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు భక్తులు హాజరయ్యారు. గోపాష్టమి పురస్కరించుకొని చెన్నూరు శ్రీ రామాలయంలోని రాధాకృష్ణ భజన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కొండపేట ఇస్కాన్ ప్రార్థన మందిరంలో పూజలు నిర్వహించారు. చెన్నూరు నాగలకట్ట వీధిలో ఉన్న ఇస్కాన్ ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కమిటీ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.