గోరక్షణ మహా సంఘం నూతన పాలకమండలి ప్రమానస్వీకారం
1 min readప్రమాణ స్వీకారం చేసిన నూతన కమిటీ చైర్మన్ మరియు సభ్యులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తమపై నమ్మకం ఉంచి చైర్మన్ మరియు సభ్యులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి, ముఖ్యంగా మన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కి, కమిటీ ఏర్పాటు కోరుకు కృషి చేసిన వారికి పేరుపేరునా కృతజ్ఞతలుకులమతాలకు మరియు పార్టీలకు అతీతంగా పని చేస్తున్న ఏకైక ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ కర్నూల్ నగరంలోని పలు పాత పూర్వకాలపు దేవాలయాల అభివృద్ధి కొరకు సుమారుగా 3 కోట్ల నిధులను మంజూరు చేపించి తెచ్చిన సహాయ సహకారాలు అందించిన ఏకైక ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ కర్నూలు జిల్లా గోరక్షణ మహా సంఘం నూతన పాలకమండలి సభ్యులు ప్రమానస్వీకారం చేశారు. కర్నూలు జిల్లా గోరక్షణ మహా సంఘం అధ్యక్షుడిగా ఆదిమోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కర్నూలు లోని పార్క్ రోడ్డు వద్దనున్న గోశాలలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ , కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ , మేయర్, మాజీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు,చైర్మన్ లు,ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులు మరియు పలువురు మాట్లాడుతూ గోవులను రక్షించి గోశాలల అభివృద్ధికి కృషి చేయాలని నూతన పాలక మండలి సభ్యులను కోరారు. గోశాలల ఆస్థులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని ఆయన కోరారు. గోవుల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని గోశాల నూతన అధ్యక్షుడు ఆది మోహన్ రెడ్డి తెలిపారు.స్థానిక కర్నూలు గోశాల నందు నూతన కార్యవర్గ చైర్మన్ మరియు సభ్యులుగా నియమితులైన ఆది మోహన్ రెడ్డి , సభ్యులు భాస్కర్ రెడ్డి , శేషయ్య , శకుంతల (కేదార్), కవిత , పార్వతమ్మ , జవహర్లాల్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ , కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ , కర్నూలు జిల్లా అధ్యక్షులు కర్నూలు నగర మేయర్ బివై రామయ్య గారు, నగరాధ్యక్షురాలు సత్యనారాయణమ్మ , పాల్గొని గోశాల దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మాజీ చైర్మన్, గోశాల ఈవో, గోవులు, కర్నూలు నియోజకవర్గ వివిధ కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, వార్డ్ ఇన్చార్జి నాయకులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు మరియు నూతన కార్యవర్గ సభ్యుల బంధువులు మిత్రుల మధ్యలో ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.