క్రెడాయ్ నూతన ఛైర్మెన్ గా గోరంట్ల రమణ ఏకగ్రీవం…
1 min read
క్రెడాయ్ కర్నూలు చాప్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల, బిల్డర్ల , సమూహమంతా కలిసి
కర్నూలు, న్యూస్ నేడు: “క్రెడాయ్” అనే సంస్థను ఏర్పాటు చేసుకుని 2 సం.ఒక సారి వారి సంఘం యోక్క ఎన్నికలు నిర్వహించుకోవడం పరిపాటి ఈ సం. విశ్వ హిందూ పరిషత్ మాజీ జిల్లా అధ్యక్షులైన గోరంట్ల అసోసియేట్స్ అధినేత గోరంట్ల రమణ సుమారు 100 మంది సభ్యులుగా గల క్రెడాయ్ సంస్థకు ఈ ఎన్నికలు 16/03/2025, ఆదివారం, స్థానిక కల్లూరు రోడ్ లోని క్రెడాయ్ భవన్ లో జరిగింది. ఈ ఎన్నికల్లో క్రెడాయ్ కర్నూలు చాప్టర్ నూతన ఛైర్మెన్ గా గోరంట్ల రమణ ,మరియు అధ్యక్షులు గా సురేష్ రెడ్డి, కార్యదర్శిగా శ్రీ గోవర్ధన రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రముఖ ఆర్కిటెక్ట్ రంగనాథ రెడ్డి తెలియజేశారు.నూతన ఛైర్మన్ గా ఎన్నికైన గోరంట్ల రమణ మాట్లాడుతూ…
నిర్మాణ రంగ దారుల సంస్థ
నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్న గోరంట్ల రమణ గతములో 2015-2021 వరకు కార్యదర్శి గా , అధ్యక్షులు గా ఉండి సంస్థకు కర్నూలు జిల్లాలో స్థాయీ, బలం పెంచి సంస్థ సభ్యుల సహకారముతో ఎన్నో సాంఘిక కార్యక్రమాలు, ” ప్రాపర్టీ షో ” ల ద్వారా ప్రాచుర్యం కల్పించి సంస్థకు స్వంత కార్యాలయ ప్రాంగణం ఏర్పాటు చేయటములో ప్రముఖ పాత్ర వహించానని. అలాగే స్విమ్మింగ్ అసొసియేషన్ అధ్యక్షుడిగా , విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా విశేష సేవలు అందించానన్నారు.అధ్యక్షులు గా ఎన్నికయిన సురేష్ రెడ్డి గతములో కార్యదర్శి గా మరియు క్రెడాయ్ ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. గోవర్ధనరెడ్డి తొలిసారి కార్యదర్శి గా ఎన్నిక అయ్యారు.ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కర్నూలు నిర్మాణ రంగానికి నూతన కార్యవర్గం కొత్త ఊపుని తీసుకువస్తారని సభ్యులు ఆశిస్తున్నారు.