గోశాల అభివృద్ధికి ప్రణాళిక
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: గోశాల అభివృద్ధికి దేవస్థానం తరపున అభివృద్ధి ప్రణాలికను అమలు చేస్తున్నట్లు మహానంది దేవస్థానం ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం గోశాలను సందర్శించారు. గోశాల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో గోవులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోశాల చుట్టూ ఆరు అడుగుల మేర పెన్ సింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని సిబ్బందిని ఆదేశించారు.గోవులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అలాగే గోశాల నుండి బయటికి మురుగు నీరు వెళ్లేందుకు సైడు కాలువ,ఇంకుడు గుంత నిర్మించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏ ఈఓ మధు, ఏ ఈ శ్రీనివాసులు, మల్లయ్య, పూజారి సుబ్బయ్య, తదితరులు ఉన్నారు.