గోసుల రామసుబ్బారెడ్డి నేత్రదానం- ఇద్దరు అంధులకు చూపు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలం లోని, ముండ్ల పల్లె గ్రామానికి చెందిన గోసుల రామసుబ్బారెడ్డి (72 సంవత్సరాలు) అనారోగ్యంతో గురువారం మరణించడం తో ఆయన భార్య పద్మావతమ్మ, కుమారులు వెంకట సుబ్బారెడ్డి,వెంకటశివారెడ్డి, కుమార్తె మాధవి, కోడళ్ళు కృష్ణవేణి, లక్ష్మీదేవి, అల్లుడు చిన్న సుబ్బారెడ్డి లను ఏపీ అగ్రోస్ రాష్ట్ర అధ్యక్షులు నందారపు చెన్నక్రిష్ణారెడ్డి నేత్ర దానం పై అవగాహన కల్పించడం జరిగింది, అనంతరం వారిని నేత్రదానం చేసేందుకు ఒప్పించడం జరిగింది, అలాగే ఆయన పులివెందుల స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్రనిధి అధ్యక్షులు రాజు కు సమాచారం ఇవ్వడంతో నేత్రనిధి టెక్నీషియన్ హరీష్ హుటాహుటిన మృతుని స్వగ్రామమైన ముండ్లపల్లె కు వెళ్లి రామ సుబ్బారెడ్డి పార్ధివ దేహం నుండి కార్నియాలను సేకరించి హైదరాబాద్ లోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధి కి పంపడం జరిగింది. ఈ సందర్బంగా ఏపీ అగ్రోస్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నకృష్ణారెడ్డి,స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్రనిధి అధ్యక్షులు రాజు లు మాట్లాడుతూ మనిషి మరణానంతరం శరీరం తో పాటు మట్టిలో కలిసి పోయే నేత్రాలు దానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు చూపు ఇవ్వడంతో పాటు అంధత్వ నివారణకు తోడ్పాటునందించిన వారవుతారన్నారు, కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు ఎవరైనా మరణించి నేత్రదానం చేసేందుకు అంగీకారం తెలిపి 9966509374 లేదా 7093204537 లకు సమాచారం ఇచ్చినట్లు అయితే అంత్యక్రియలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కార్నియా లను సేకరించడం జరుగుతుందని వారు తెలిపారు, ప్రతి కుటుంబం నేత్రదానం అనే బృహత్కార్యాన్ని కుటుంబ సంప్రదాయంగా భావించి అంధ రహిత సమాజం కోసం తోడ్పాటు అందించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో నేత్రదానానికి అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులకు బంధువులు, సన్నిహితులు,గ్రామ పెద్దలు సేవా సమితి బృందం కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు.