సెల్ఫీలతో కోట్లు సంపాదించాడు .. ఎలాగంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : సరదాగా తీసుకున్న సెల్ఫీలే అతడికి జీవితాన్నిచ్చాయి. అంతర్జాతీయం గుర్తింపు తెచ్చాయి. సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఘొజాలి ఇండోనేసియాలోని సెమరాంగ్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి. కంప్యూటర్ ముందు కూర్చుని రోజూ ఒక సెల్ఫీ తీసుకునేవాడు. అలా ఐదేళ్లుగా చేస్తున్నాడు. గ్రాడ్యుయేషన్ సమయంలో తనలో వచ్చిన మార్పుల్ని తెలిపేలా ఆ సెల్ఫీలన్నింటిని కలిపి ఓ టైమ్ లాప్స్ వీడియో తీద్దామనుకున్నాడు. ఆ సమయంలోనే నాన్ ఫంజిబుల్ టోకెన్లు అతడి దృష్టిని ఆకర్షించాయి. వెంటనే ఎన్ఎఫ్టీకి చెందిన వెబ్ సైట్ లో అకౌంట్ ఓపెన్ చేశాడు. జనవరి 10న ఘొజాలి ఎవిరిడే పేరుతో 933 సెల్ఫీలు అమ్మకానికి పెట్టాడు. ఒక్క దాని ధర మూడు డాలర్లుగా నిర్ణయించాడు. ఘొజాలి సెల్పీని ఎన్ఎఫ్టీగా కొన్నట్టు ఓ సెలబ్రిటీ చెఫ్ ట్వీట్ చేశారు. దీంతో అతడి సెల్ఫీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. వీటి ద్వార అతడికి మొత్తం 7.5 కోట్ల రూపాయలు వచ్చింది.