పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పాలన..
1 min read– ప్రతి వార్డులో అభివృద్ధి పనులు..
– నందికొట్కూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని జై కిసాన్ పార్కు నందు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన, మున్సిపల్ కమీషనర్ పి.కిషోర్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో కౌన్సిల్ సభ్యులు వార్డు సమస్యలను చైర్మన్, కమీషనర్ దృష్టికి తీసుకొచ్చారు. చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో నందికొట్కూరు పట్టణ అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు.కొందరు స్వార్థ రాజకీయాల కోసం విమర్శించడమే పనిగా పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వార్డు ల బేదం లేకుండా ప్రతి వార్డు ను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని విమర్శించే ముందు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు.మెప్మా కార్యాలయం లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని మీ దృష్టికి వచ్చినా వాటిని ప్రోత్సహించడం మంచి పద్దతి కాదని… ఇక మీదట ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని మెప్మా సియంయం శాంత కుమారి ని హెచ్చరించారు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదని ప్రజలకు మంచి చేయాలనే తపన కలిగి ఉండాలని అన్నారు.అదే విధంగా కో ఆప్షన్ సభ్యులు కేశవరెడ్డి శ్రీనివాస రెడ్డి , కౌన్సిలర్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ నిస్వార్థంగా నందికొట్కూరు పట్టణ అభివృద్ధి కై పాటుపడుతున్న చైర్మన్ ను ప్రశ్నించడం సరైన అవగాహన లేకపోవడమేననీ అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి , డిఈఈ నాయబ్ రసూల్, టౌన్ ప్లానింగ్ అధికారి బాల మద్దయ్య, ఆర్వో విజయలక్ష్మి, కౌన్సిలర్ లు కాటేపోగు చిన్నారాజు, అబ్దుల్ హమీద్ మియ్య, పి.చాంద్ భాష, అబ్దుల్ రవూఫ్,మానపాడు అశోక్, షేక్ నాయబ్, లాలు ప్రసాద్, కొండ్రెడ్డి విజయమ్మ, గుర్రాల లక్ష్మిదేవి, యం.సమీరా భాను, మందడి వాణి, చింత లక్ష్మిదేవి, జె.రాధిక, పి.శాంతా కుమారి, షేక్ రేష్మా, యం.కరీష్మా, బోయ జయమ్మ, కొండేజు క్రిష్ణవేణమ్మ, వీరబొమ్మ రూపాదేవి మరియు వివిధ శాఖల అధికారులు మరియు సచివాలయ సెక్రెటరీలు పాల్గొన్నారు.