PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

’కోవిడ్​’ అనాథలకు… ప్రభుత్వం భరోసా

1 min read

– ఐదుగురి పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఫిక్సిడ్​ డిపాజిట్ల బాండ్ల అందజేత
– డిప్యూటీ సీఎం అంజాద్​ బాష
పల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో: కరోన రక్కసికి అసువులు బాసిన తల్లిదండ్రుల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి ఎస్​.బీ. అంజాద్​ బాష అన్నారు. శనివారం కలెక్టరేట్​లోని తన ఛాంబరులో ఆయనతోపాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు కలిసి… జిల్లాలో కరోనాతో తల్లిదండ్రులు మృతి చెంది అనాథలైన మూడు కుటుంబాలకు చెందిన ఐదుగురిది పిల్లలకు రాష్ట్రప్రభుత్వం అందజేసిన రూ.10 లక్షల సహాయ నిధికి సంబంధించి ఫిక్స్​డ్​ డిపాజిట్ బాండ్లను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అందజేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా తల్లిదండులు చనిపోతే.. వారి పిల్లల భవిష్యత్ అంధకారంలో పడకుండా.. వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. అనాథ పిల్లల భవిష్యత్​ అవసరాల దృష్ట్యా ఈ సహాయం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం అంజాద్​బాష స్పష్టం చేశారు.
రూ.10లక్షల చొప్పున.. ఐదుగురికి..
కరోనాతో మృతి చెందిన సిద్దవటంకు చెందిన చంద్రబాబు, లక్ష్మీదేవి పిల్లలు జింకా దివ్య (16), జింకా భగీరథ్(11) లకు, కడపకు చెందిన గౌస్ బాషా, కదిరూన్ కుమారుడు సయ్యద్ ముబారక్ (15), అలాగే.. ఖాజీపేటకు చెందిన పుల్లయ్య, నారాయణమ్మ పిల్లలు ఎన్. రాముడు (17), ఎన్. లక్ష్మణుడు (17)ల పేర్లతో ఒక్కొక్కరికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల సాయం మొత్తంను ఎఫ్.డి. బాండ్ల రూపంలో పిల్లలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి, మౌలిక సదుపాయాల సలహాదారు రాజోలు వీరారెడ్డి, ఎల్డిఎం చంద్రశేఖర్, ఐసీడీఎస్ పిడి పద్మజ, డిఎహెచ్ఓ డా.అనిల్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ సంబటూరు ప్రసాద్, ఐసీడీఎస్, సంబందిత శాఖలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author