ప్రభుత్వ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలి: ఏడి పి. విజయ
1 min readవిభిన్న ప్రతిభవంతులకు సెల్ ఫోన్, లాప్ ట్యాప్ లు పంపిణీ
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: విభిన్న ప్రతిభవంతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు, ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు పి. విజయ అన్నారు. మంగళవారం ఏడి ఛాంబర్ లో విభిన్న ప్రతిభవంతులైన చెవిటి, మూగ దివ్యంగులకు ఏడి విజయ మొబైల్ ఫోన్, లాప్ ట్యాప్ లు అందజేశారు. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ విభిన్న ప్రతిభవంతులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యమాలను అమలు చేస్తుందన్నారు, ప్రభుత్వం నుండి విరికి అందే ప్రతి లబ్ది ని తమ శాఖ ద్వారా అందిస్తున్నామన్నారు. అందులో భాగంగానే వివిధ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విభిన్న ప్రతిభావంతుల విద్యభివృద్ధి కొరకు వారికీ మొబైల్ ఫోన్, లాప్ ట్యాప్ లు అందించడం జరుగుతుందన్నారు. ప్రీతి అనే బాలికకు మొబైల్ ఫోన్, అన్వేష్, పూనేంద్రలకు లాప్ ట్యాప్ లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం వీరి కోసం అనేక పరికరాలు అందిస్తుందన్నారు. ప్రతి దివ్యాంగుడు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో అనేక మంది విభిన్న ప్రతిభావంతులకు వారికి అవసరమైన విల్ చైర్ లు, చేతి కర్ర లు, మూడు చక్రాల బైక్ లు మొబైల్ ఫోన్ లు, లాప్ ట్యాప్ లు, వినికిడి యంత్రాలు వంటి పరికరాలను అందజేయడం జరిగిందని ఆమె వెల్లడించారు. కార్యక్రమం లో సి ఆర్ ఓ సి. రామాంజనేయులు, జూనియర్ అసిస్టెంట్ వెంకట రెడ్డి, సూపరింటెండెంట్ మహమ్మద్ అయూబ్ తదితరులు పాల్గొన్నారు.