PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల్సిందే..!

1 min read

– రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షులు , ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని రాజునాయుడు

– జాతీయ రహదారి దిగ్భందించిన విద్యార్థులు
పల్లెవెలుగు కల్లూరు అర్బన్ : పాణ్యం నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు లేక పోవడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షులు , ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని రాజునాయుడు. పాణ్యంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ… బుధవారం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ , ఆర్వీఎఫ్ , బీసీ – ఎస్సీ – ఎస్టీ – మైనారిటీ విద్యార్ధి , యువజన సమైఖ్య , ఆలిండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో పాణ్యం ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి వందలాది మంది విద్యార్ధినీ , విద్యార్ధులతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ( ఏ.ఐ.ఎఫ్.బి ) రాష్ట్ర కార్యవర్గ సభులు రామినేని రాజునాయుడు , జిల్లా ఉపాధ్యక్షులు కేజే. శ్రీనివాసులు , పాణ్యం డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటాద్రీ , బీసీ – ఎస్సీ – ఎస్టీ – మైనారిటీ విద్యార్ధి , యువజన సమైఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్ , ఆర్వీఎఫ్ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు ప్రతాప్ , రియాజ్ భాషా , జిల్లా ఉపాధ్యక్షులు గురునాధ్ , ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ ( ఏ.ఐఎస్.బి ) జిల్లా అధ్యక్షులు డీసీ నాగన్నలు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నా ప్రజా ప్రతినిధులు , అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. , పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక వందల మంది విద్యార్ధినీ , విద్యార్ధులు చదువులు మధ్యలోనే మానేస్తున్నారనీ , పాణ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నాలుగు మండలాల్లోని 35 గ్రామాల నుండి వందల మంది విద్యనభ్యసించడానికి వస్తున్నారనీ తక్షణమే ఎంఎల్ఏ గారు , అధికారులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నడుంబిగించాలని వారు కోరారు. అనంతరం పాణ్యం ఎంఆర్ఓ రత్న రాధికకు వినతిపత్రం అందజేశారు. ఎంఆర్ఓ ని కలిసిన వారిలో CITU మండల కార్యదర్శి భాస్కర్ , ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బనగానపల్లె కార్యదర్శి పుల్లయ్య , పైన పేర్కొన్న నేతలు పాల్గొన్నారు.

About Author