ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించండి:ఏపీ జేఏసీ
1 min read
* పిఆర్సి చైర్మన్ ని వెంటనే నియమించాలి
* పెండింగ్ లో ఉన్న డిఏలు మంజూరు చేయాలి
* ఏపీ జేఏసీ డిమాండ్
విజయవాడ, న్యూస్ నేడు : ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు తదితర అంశాల మీద చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం సోమవారం గాంధీనగర్ లోని ఎన్జిజీవో హోమ్ లో జరిగింది. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళవలసిన ముఖ్యమైన అంశాలు వంటి వాటిపై విస్కతమైన చర్చ జరిగినది. ఈ సమావేశంలో ఏపి ఎన్జీజివో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.విద్య సాగర్ ను రాష్ట్ర JAC డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన పేరుకుపోయిన అంశాలు, 25 వేల కోట్లు బకాయిలు, పిఆర్సి కమిటీ చైర్మన్ నియామకం , బకాయిల చెల్లింపు , పదవీ విరమణ బెనిఫిట్స్ చెల్లింపు , పెండింగ్ DA ల మంజూరు తదితర అంశాలపై సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ సమస్యలన్నీటిని రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ దృష్టికి, రాష్ట్ర, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని పరిష్కారానికై ఒత్తిడి తేవాలని జేఏసీ తీర్మానించింది.. సమావేశంలో ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి, జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏపీ యుటిఎఫ్ కార్యదర్శి కే ప్రసాద్, ఎన్జీవో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విద్యాసాగర్, ఏపీ ఎస్టియు సంఘ అధ్యక్షుడు శ్రీ రఘురామిరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయు రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శ్రీ రమణారెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మంజుల, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హృదయ రాజు, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికాకి ప్రకాష్ రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రొవిషన్ ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ నరసింహo, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ జానీ బాషా, పిఓ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ హరినాథ్ బాబు, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్, ఏపీ CPS ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ సీఎం దాస్, ఆంధ్రప్రదేశ్ నర్సులు సంఘం అధ్యక్షురాలు శ్రీ రాధమ్ తదితరులు పాల్గొన్నారు.