ఈకెవైసీ గడువు ఏప్రిల్ 31 వరకు ప్రభుత్వం పొడిగింపు
1 min read
రేషన్ డీలర్ల వద్ద ఈ-పాస్ యంత్రాలులో ఆధార్
అథ్oటికేషన్ (వేలిముద్ర) నమోదు చేయించుకోవాలి
జిల్లా పౌర సరఫరాల అధికారి వై.ప్రతాపరెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ఈనెల 31వ తేదీకి ముందుగానే రేషన్ లబ్దిదారుల ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పెండింగ్ ఈకెవైసీ ప్రక్రియని పూర్తి చేయడానికి ప్రభుత్వం గడువు పొడిగించిందని జిల్లా పౌర సరఫరాల అధికారి వై. ప్రతాపరెడ్డి తెలిపారు. తొలుత మార్చి నెలాఖరు వరకే ప్రభుత్వం అవకాశం కల్పించిందని,అయితే చాలామంది సభ్యులు అందుబాటులో లేకపోవడం, పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలన వెళ్లి ఉండటం వంటి కారణాలతో ఈకెవైసీ సంపూర్ణం కానందున మరో నెల పాటు అనగా ఏప్రిల్ 31 వరకూ గడువుని పొడిగిస్తూ శుక్రవారం సాయంత్రం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయాలకు సమాచారం అందిందన్నారు. కావున ఈకెవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరూ ఆందోళన చెందవద్దు, మరో నెల పాటు గడువుని ప్రభుత్వం పొడిగించిందన్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా, మిగిలిన లబ్దిదారుల ఈకేవైసీ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఇది ముఖ్యంగా ప్రభుత్వ నిధుల మరియు రేషన్ పంపిణీ వ్యవస్థను సక్రమమగా అమలు చేయడానికి, అక్రమ వినియోగాన్ని నివారించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీ ప్రక్రియని పూర్తి చేస్తారు. ఇది ఒక విధంగా ఈపిఎఫ్ఓ పించన్ దారులు ఏ విధంగా అయితే ఏటా లైఫ్ సర్టిఫికేట్లు ఇస్తారో అలాంటి ప్రక్రియే. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటికే ఎవరివైతే ఈకేవైసీ పెండింగ్లో ఉన్నాయో వారి వివరాలతో కూడిన లిస్టులను విడుదల చేశారు. అయితే కొంతమంది మాత్రమే ముందుకొచ్చి ఈకేవైసీని రేషన్ దుకాణాల్లో చేయించుకొన్నారు. ఇంకా చాలామందివి అలానే పెండింగ్లో ఉన్నాయి. ఇందుకు కారణం విద్యార్థులు హాస్టల్స్లో ఉండటం, వ్యవసాయ కార్మికులు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఉండటమే. అలానే కొంతమంది చనిపోయినప్పటికి వాళ్ల పేర్లను స్వచ్చంధంగా తొలగించకుండా ప్రతీ నెలా రేషన్ పొందుతున్నారు.ప్రస్తుతం ఈకేవైసీ ప్రక్రియ రెండు వ్యవస్థల ద్వారానే జరుగుతున్నదని రేషన్ డీలర్ల వద్ద ఈ-పాస్ యంత్రాలలో ఆధార్ అథెంటికేషన్(వేలిముద్ర) వేసి చేసుకోవచ్చన్నారు. వీఆర్వోల వద్ద కూడా ఈకేవైసీ చేసుకొనే సదుపాయం ఉందని, ఈ సదుపాయాన్ని ఎండీయూ ఆపరేటర్లకు కూడా కల్పించాల్సిందిగా స్థానిక అధికారులు ప్రభుత్వానికి నివేదించారన్నారు. దీని వలన రేషన్ పంపిణీకి ఎండియూ వెళ్లినప్పుడు, సరుకులు తీసుకోవడానికి వచ్చే వారి కుటుంబాల్లో ఎవరి ఈకేవైసీ పెండింగ్లో ఉందో వాళ్ళు చెబుతారని, దాంతో అక్కడే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. అధికారికంగా ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఆ వివరాలను తెలియజేయడం జరుగుతుందన్నారు.ఏలూరు జిల్లాలో ఇంకనూ 1,45000 యూనిట్లు ఈకేవైసీ పెండింగు ఉండగా సదరు ఈకేవైసీ ప్రక్రియను లబ్దిదారులోతో సత్వరమే పూర్తిచేయించవలసినదిగా ఏలూరు జిల్లాలోని అందరూ పౌరసరఫారాల డిప్యూటీ తహసిల్దార్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ప్రక్రియను నూటికి 100 శాతం పూర్తి చేయాలని సూచించామన్నారు.