PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని డిటీఎఫ్ రాష్ట్ర నాయకులు రోశన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న చర్యలపైన ఆయన బుధవారం ఈ విధంగా స్పందించారు. ఉపాధ్యాయుల జీతాల చెల్లింపుతో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం. అత్యంత భాదాకరము. ప్రతినెల జీతాల కోసం ఎదురు చూడడం అత్యంత విచారకరం. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెన్సనర్సుకు సకాలంలో గీతాలు చెల్లించకపోవడం, జీతంకోసం ఎదురు చూడడం, అనే ప్రభుత్వం ఇష్టమైన తేటలతో, ఇష్టానుసారంగా ఒక క్రమ పద్ధతి లేకుండా వ్యవహరించడం ఉపాధ్యాయులను, ఉద్యోగులను అవమానించడము ఎంత వరకు సమంజసం. ఉపాధ్యాయుల మనోవావలను నెల నెల కించపర్చడం, అవమానించడం, కక్ష్యసాధింపు చర్యగా బావిస్తున్నాం. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు రాజ్యంగ బద్ధంగా వ్యవహరించవలసిన అవసరం వుంది. ప్రజలను, ఉద్యోగులను ఉపాధ్యాయులను వేర్వేరుగా చూడడం, విభజించు పాలించు విధానానికి స్వస్తి పలకాలి. ఆవిధంగా చేస్తే అది రజాకార్ల వ్యవస్థ అవుతుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు నెలంత కష్ట పడి విధులు నిర్వహిస్తే సకాలంలో జీతాలు చెల్లించలేని ప్రభుత్వం పరిపాలనకు అర్హులు కారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు ఉపాధ్యాయులు కారణమా అని డెమోక్రటిక్ టీచర్స్ పెడరేషన్ ప్రశ్నిస్తున్నది. చరిత్రలో ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా అవమానించిన ప్రభుత్వాలు లేవు . ఉపాద్యాయులకు, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడాని సిద్ధంగా వున్నాం. గతంలో ఉద్యోగుల హక్కులను విస్మరించిన ఉద్యోగులను ఉపాధ్యాయులను డీఏ ఇవ్వక, అనువనువున ఇబ్బందికి గురిచేసిన ప్రభుత్వాలకు గతంలో తగిన గుణపాఠం చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన సంగతిని ఈ ప్రభుత్వం గుర్తించుకోవాలి. ఉపాధ్యాయులను హింసిస్తున్న ఈ ప్రభుత్వం మాది ఉద్యోగుల పట్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పత్రికాముఖంగా చెప్పుకోవడం. సిగ్గు చేటు. ఈ ప్రభుత్వానికి ఆ అర్హత లేదని చెప్పదలచుకున్నాం. అవచరానాలకు, ఆవేదనకు గురిచేస్తూ వున్న ప్రభుత్వం ఎందుకు సకాలంలో చెల్లించడం లేదో ప్రభుత్వం, అధికారులు వివరణ ఇవ్వ వలసిన అవసరరం ఎంతైన ఉంది. బాధ్యతారాహిత్యంగా వృవహరించడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నాం. జీతం మీద ఆధారపడి జీవించే వేతన జీవులను ఈ విధంగా సమాజంలో చిన్న చూపు చూసే విధంగా చాల దిగజార్చడం అన్యాయం. ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తగదు. ఇంతవరకు నాలుగు డీఏ లు పెండింగ్ లో వున్నాయి. ఉపాద్యాయు ఉద్యోగులను తీవు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. ఒక మంత్రి ఉద్యోగులను కాళ్లు మొక్క అంటాడు. ఒక అధికారి ఉపాధ్యాయులకు జీతాలు దండగ అంటాడు. అది దేనికి సంకేతము అని ఏ కోణంలో చూడాలని డిటీఎఫ్ గా ప్రశ్నస్తున్నాం. భవిష్యత్తులో సకాలంలో చెల్లించని యెడల, ఉపాధ్యాయుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరించడం తగదు. ఈ విధానాలు మానుకోవాలని విన్నవించు కొనుచున్నాము.

About Author