ప్రభుత్వానికి మానవత్వం లేదు: దేవినేని ఉమ
1 min read
పల్లెవెలుగు వెబ్: రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం లేదని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కరోన సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు సరిగా లేదని ఆరోపించారు. జగన్ మాటలు మార్ఫింగ్ చేశారన్న కేసులో దేవినేని ఉమ గురువారం సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ విచారణకు హాజరయ్యానని ఆయన తెలిపారు. న్యాయ స్థానం మీద తనకు నమ్మకం ఉందని అన్నారు. ప్రభుత్వం మెప్పు కోసం కొందరు అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటని దేవినేని ఉమ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం గుజరాత్ అమూల్ కోసం .. సంగం డైరీని నాశనం చేస్తోందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం తనను జైల్లో పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన అన్నారు.