పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. సమస్య పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొందరపడి సమ్మెకు వెళ్లొద్దని స్టీరింగ్ కమిటీని మంత్రుల కమిటీ కోరింది. హెచ్‌ఆర్‌ఏలో ఇచ్చిన సడలింపులతో పాటు మరో స్లాబ్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రెండు స్లాబ్‌ల రద్దుపై పునరాలోచనలో ఉంది. డీఏ ఏరియర్స్‌లో ఐఆర్ మినహాయింపుపై ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు.