ఆవు పేడ కొనే ఆలోచనలో ప్రభుత్వం !
1 min read
పల్లెవెలుగు వెబ్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆవుపేడ కొనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ప్రకటించారు. ఆవు పేడ నుంచి ఎరువులు, ఇతర ఉత్పత్తులు తయారు చేసే ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆవు పేడ, మూత్రంతో ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఔషధాలు తయారు చేయవచ్చని ఆయన చెప్పారు. దీని వల్ల ఆవులు పోషణలో ఉన్న కుటుంబాలు బాగుపడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తద్వార దేశ ఆర్థిక వ్యవస్థ సైతం బలపడే అవకాశం ఉందని అన్నారు. మధ్యప్రదేశ్ లోని స్మశాన వాటికల్లో పిడకల్ని ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గోశాలల్ని నెలకొల్పిందని తెలిపారు. అయితే ప్రజల భాగస్వామ్యంలేనిదే అది సాధ్యం కాదని తెలిపారు.