PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ ఇంటర్ , డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఎన్నో సంవత్సరాల నుండి గడివేముల వాసులు కలలు గంటున్న ప్రభుత్వ జూనియర్ , డిగ్రీ కాలేజీలను గడివేముల మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్) గడివేముల మండల కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల రెవెన్యూ డివిజినల్ అధికారి శ్రీనివాసులు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాధ్ , జిల్లా కార్యదర్శి రియాజ్ , గడివేముల మండల అధ్యక్షులు రాము , పాణ్యం మండల నాయకులు బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ గడివేముల ,చుట్టు ప్రక్కల దాదాపు 40 గ్రామాల నుండి విద్యార్దినీ , విద్యార్దులు పదవ తరగతి తరువాత ఇంటర్ , డిగ్రీ విద్య చదవడానికై నంద్యాల , నందికొట్కూరు ప్రాంతాలకు వ్యయ , ప్రయాసలతో వెళ్లి చదువు””కొంటు””న్నారని , చాలా మంది విద్యార్దినీలు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదవడానికి ఇబ్బంది పడి చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. విద్యార్దుల కష్టాలను గుర్తించి గడివేములలో ప్రభుత్వ ఇంటర్ , డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని కోరారు.స్పందించిన ఆర్డీఓ శ్రీనివాసులు గారు ఈ విషయాన్ని ఆర్ఐఓ , రాయలసీమ యూనివర్సిటీ , ఉన్నతాధికారుల దృష్ఠికి తీసుకువెళ్లి కాలేజీల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.*ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బు. శివ. నరేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author