ప్రభుత్వ భూమి ప్రజలందరికీ ఉపయోగపడేలా వినియోగించాలి
1 min read– మండల విలేకరుల సంఘం
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: కౌతాళం మండలం కేంద్రమైన, కర్నూలు జిల్లా మేజర్ అయినటువంటి కౌతాళం ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న గ్రామ కంఠం భూమిని 13 సెంట్లు, సర్వే నంబర్ 330/1 గల స్థలాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కబ్జాకు గురి చేస్తున్నారు. శుక్రవారం రోజున ఉదయం 9 గంటలకు ఖాళీ స్థలంలో గరుసు వేయడానికి సిద్ధం చేస్తుండగా, దీనిపై మండల విలేకరులు అందరూ మమేకమై ఈ విషయము స్పందించి, మండల తహసిల్దార్ ఇన్చార్జి రమేష్ రెడ్డి, మరియు కౌతాళం సర్పంచ్ పాల్ దినకర్, అయినటువంటి మండల కౌతాళం పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ఖాళీ స్థలాన్ని కబ్జాకు గురి కాకుండా కొంతమంది పట్టాలు ఉన్నాయని స్థలాన్ని కబ్జా చేసుకోబోతున్నారు దీన్ని విచా విచారనాలు అన్యక్రాంతుల నుండి స్థలాన్ని విడిపించి, పట్టాలు ఉన్న వాళ్ళని రద్దుచేసి ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలని, వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము…… ఈ కార్యక్రమంలో, రామాంజనేయులు, గోపాల్ ,మంజు, ఉమేష్ ,విజయ్, సాదిక్ భాషా, శివకుమార్, నరేష్, గోట్టయ్య, రాజు, ముక్తార్ బాషా, రాముడు, అనిల్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.