ప్రభుత్వ రేషన్ బియ్యం పట్టివేత
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని శివాలపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని గోపవరం పరిసరాలలో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రభుత్వ చౌక బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఇన్ఫోసిమెంట్ అధికారులు గురువారం సాయంత్రం పట్టుకోవడం జరిగింది,రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారి అడిషనల్ ఎస్.పి. శ్రీ షేక్ మాసుం బాష ఆదేశాల మేరకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు చెన్నూరు మండలం వేదాస్ స్కూల్ నుండి గోపవరం గ్రామమునకు పోవు రోడ్డులో కుడి వైపున గల చిలమకూరి పాపయ్య గారి రేకుల షెడ్డు నందు ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమముగా నిలువ ఉంచి రవాణా చేయుటకు సిద్ధంగా ఉన్నారనే సమాచారం మేరకు ఆ స్థలం వద్దకు పోయి అక్కడ ఉన్న రేకుల షెడ్డును తనిఖీ చేయగా ఆ రేకుల షెడ్డు నందు 205 బస్తాలతో కూడిన 100.60 క్వింటాళ్ళ ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని రవాణా చేయుటకు సహకరిస్తున్న AP39 UV 1190 నెంబరు గల బజాజ్ మాక్సిమా, AP39TT 6706 నెంబరు గల మహీంద్రా ఆటోలను, అలాగే వేయింగ్ మెషిన్ మొత్తం విలువ Rs.867490/- లు కాగా సదరు బియ్యాన్ని, 2 ఆటోలను వేయింగ్ మెషిన్ ను పంచనామా ద్వారా స్వాధీనపరచుకుని చెన్నూర్ CSDT అయిన PMV మనోజ్ కు అప్పగించి రేషన్ బియ్యాన్ని రవాణాకు సహకరిస్తున్న చెన్నూరుకు చెందిన బ్రహ్మయ్య, కిషోర్ సదరు ఆటోడ్రైవర్ లపై చెన్నూరు పోలీస్ స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేశారు, ఈ దాడుల్లో విజిలెన్సు అధికారులైన జి.ఈదురు బాష, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జి శ్రీనివాసులు, అసిస్టెంట్ జియాలజిస్ట్, చెన్నూర్ CSDT.. P.M.V.మనోజ్, శివాలుపల్లి వి ఆర్ ఓ., పి వి.నారాయణ, విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ యాస్ రావు, యం నాయక్ డి.రంతు బాష తదితరులు పాల్గొన్నారు.