ప్రభుత్వ రేషన్ బియ్యం పట్టివేత
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు టౌన్ సచివాలయం పరిధిలో గల రసూల్ బేగ్ కు చెందిన అద్దె గది డోర్ నెంబర్ 5/ 85 లో అక్రమంగా సేకరించిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని రవాణా చేయుటకు సిద్ధంగా ఉన్నారని సమాచారం అందిందని విజిలెన్స్ అండ్ ఇన్ఫోసిమెంట్ ఇన్స్పెక్టర్ జి ఈదురు భాష, బాలగంగాధర్ రెడ్డిలు తెలిపారు, ఈ మేరకు సోమవారం వారు రీజనల్ విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారి, షేక్ మాసుం బాష ఆదేశాల మేరకు ఉదయం 08.00 గంటలకు చెన్నూరు టౌన్ నందు, సచివాలయం కుడిప్రక్కన గల డోర్ నెంబర్ 5/85, రసూల్ బేగ్ అనునతనికి చెందిన అద్దెగది ముందర అక్రమంగా సేకరించిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని నిల్వఉంచి రవాణా చేయుటకు సిద్దముగా ఉన్నందున ఆ స్థలం వద్దకు పోయి తనిఖీ చేయగా సదరు రూములో వివిధ రంగులు గల ప్లాస్టిక్ సంచులలో 115 బస్తాలతో కూడిన 5,666 కిలోలు గల పిడిఎస్ రేషన్ బియ్యంను గుర్తించడం జరిగిందని తెలిపారు, పై స్థలం నందు చెన్నూరుకు చెందిన కొండూరు హరిక్రిష్ణ అనే వ్యక్తి తన యజమాని అయిన చెన్నూరు టౌన్ కు చెందిన కాటం వీరబ్రహ్మయ్య ఆదేశాల మేరకు చెన్నూరు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి పిడిఎస్ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని వాటిని అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలిసింది. 115 బస్తాలతో కూడిన 5,666 కిలోలు గల పిడిఎస్ రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు, కాగా వాటి మొత్తం విలువ రూ 2,35,139/- లుగా ఉండినదని, సదరు బియ్యాన్ని పంచనామా ద్వారా స్వాధీనపరచుకుని చెన్నూర్ సి ఎస్ డి టి అయిన పి ఎం వి.మనోజ్ అప్పగించి ఈ అక్రమ రవాణాకు సహకరిస్తున్న చెన్నూరుకు చెందిన కాటం వీర బ్రహ్మయ్య కొండూరు హరి క్రిష్ణలపై చెన్నూరు పోలీస్ స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేయడమైనదని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో జె. మురళీకృష్ణ అగ్రికల్చర్ ఆఫీసర్, చెన్నూరు టౌన్ VRO- A.శ్రీనివాసులు, విజిలెన్స్ కానిస్టేబుల్ K.నాగేశ్వర రావు,రంతు బాష తదితరులు పాల్గొన్నారు.