హిందువులు ధర్మకర్త గా ఉన్న దర్గాకు ప్రభుత్వ గుర్తింపు హర్షణీయం
1 min read– తెలుగుదేశం నేత సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కమలాపురం: పట్టణంలో హిందు ముస్లిం ల ఐక్యతకు ప్రతీక గా వెలిసిన దర్గా..ఏ.. గఫారియా ఖాధరియా దర్గా కు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు రావడం హర్షణీయమని, తెలుగు నాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు. బుదవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు కు చెందిన నామ నాగయ్య శ్రేష్టి కుటుంబీకులు ధర్మకర్తలుగా కమలాపురం పట్టణం లో హిందువులు దర్గా నిర్మాణం చేసారన్నారు. దర్గా ఏర్పడి అనేక దశాబ్దాలు అయినప్పటికీ లక్షలాది మంది భక్తులు ఉన్నప్పటికీ, ప్రభుత్వ గుర్తింపు రాలేదన్నారు . ప్రస్తుతంజిల్లా వాసి ముఖ్యమంత్రి గా ఉండడం తో కమలాపురం దర్గాకు ప్రభుత్వ గుర్తింపు రావడం చాలా సంతోష కరమైన పరిణామన్నారు. కమలాపురం దర్గాకు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సాయినాథ్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు కమలాపురం పట్టణంలో ఎంతో చారిత్రాత్మకంగా ఉన్న దర్గాకు ప్రభుత్వ గుర్తింపు రావడం అలాగే ఉరుసు ఉత్సవాలకు ప్రభుత్వ లాంఛనాలు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని ఆయన పేర్కొన్నారు . కమలాపురం ప్రాంతంలోని హిందూ ముస్లింల ఐక్యతకు హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రీ, హజరత్ దస్తగిరి షా ఖాద్రీ హజరత్ మౌలానా మౌల్వి ఖాదర్ మొహిద్దిన్ షా ఖాద్రి, హజరత్ జహరుద్దీన్ షా ఖాద్రి ఎంతో మహిమలు చూపుతూ ప్రతీకగా నిలిచి ఉన్న దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం కమలాపురం ప్రాంత వాసుల అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కమలాపురం ఉరుసు ఉత్సవాలను, ఈ ప్రాంతంలోని హిందూ ముస్లింలు అందరూ సమైక్యంగా పండుగలాగా జరుపుకోవాడం గత అనేక దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోందన్నారు దర్గాకు ప్రభుత్వ గుర్తింపు రావడానికి హజరత్ ఫైజల్ గఫార్ షా ఖాద్రి, వారి సోదరులు ఇస్మాయిల్ తదితరులు విశేష కృషి చేయడం అభినందనీయమన్నారు.